ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఈ నెల 28న సున్నా వడ్డీ రాయితీ విడుదల చేయనుంది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే.. రేపు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ అమలాపురం పర్యటన వెళ్లాల్సి ఉంది. కానీ… ఈ పర్యటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ అమలాపురం పర్యటనను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.
ఈ మేరకు అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీఎం జగన్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ విడుదల చేయనున్నారు సీఎం జగన్. కాగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలు మూతపడనున్నాయి. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీర్పు నిరసనగా ఇవాళ స్కూల్స్ మరియు కాలేజీలు బంద్ చేపడుతున్నట్లు తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య, aisf వెల్లడించాయి.