ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక శాఖలను నిర్వహించిన ఐఏఎస్ అధికారులు రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో భారీ విజయం తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ఐఏఎస్ అధికారులు రాజీనామా చేయగా.. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో మాజీ సీఎం జగన్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సమీర్ శర్మ రాజీనామాకు ప్రభుత్వం గా ఆమోదం తెలిపింది.
అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్, అటవీ అభివృద్ధి ఎండీ మధుసూదన్, రైతు సాధికార సంస్థ ఎండీ విజయ్ రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరితో పాటు అదనపు అటవీ ముఖ్య సంరక్షణాధికారి గా పనిచేసిన కె. గోపీనాధ్, ప్రేమ్ చంద్రారెడ్డి సైతం ప్రభుత్వం ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే వీరి స్థానంలో ఇతరులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.