ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదు – రోజా

-

ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదంటూ ఏపీ మంత్రి రోజా సెటైర్‌ వేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున టీడీపీ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఎన్టీఆర్ పేరుని తీసి..వైఎస్సార్ యూనివర్సిటీని జగన్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది.

అసలు ఈ యూనివర్శిటీతో వైఎస్సార్‌కు సంబంధం లేదు. కానీ వైఎస్సార్ డాక్టర్ అని..అందుకే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టమని చెబుతున్నారు. అయితే.. దీనిపై బాలయ్య రంగంలోకి దిగి.. జగన్‌ సర్కార్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో బాలయ్యకు ఏపీ మంత్రులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రోజా కూడా బాలయ్యపై విరుచుకపడ్డారు. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే..!! అంటూ ట్వీట్‌ చేశారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news