వివేకా హత్య కేసులో 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సీబీఐకి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు రోజూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని ఫైర్ అయ్యారు. వివేకా కేసులో కథలు అల్లి జగన్ ను ఎలా ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.
ఎటువంటి అంశాలపైనైనా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు. చివరికి గౌతమ్ రెడ్డి మరణంపై కూడా నీచంగా మాట్లాడే సంస్కృతి వారిదని మండిపడ్డారు సజ్జల. రోజూ ఏదో ఒక బురద జల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారని.. వివేకా హత్య కేసులో మేము అడిగిన నాలుగు ప్రశ్నలకు చంద్రబాబు, సీబీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విచారణలో మమ్మల్ని ఇరికించాలని చంద్రబాబు, పచ్చ మీడియా విశ్వప్రయత్నం చేస్తున్నారని.. విచారణ జరుగుతున్న తీరులో కీలక అంశాలు విస్మరించారని మేము భావించామన్నారు. అవే మేము ప్రశ్నిస్తున్నాం…లేఖ ఎందుకు సాయంత్రం వరకూ బయటకు రాలేదని.. గుండె పోటు అని చెప్పింది ఎవరు అనేది ప్రశ్నించామని తెలిపారు.