టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడుపై సజ్జల వివాదస్పద వ్యాఖ్యలు

-

టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడులపై నిప్పులు చెరిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటీవల మహిళలపై చోటుచేసుకుంటున్న దాడుల్లో చాలావరకూ టీడీపీ వాళ్ల ప్రమేయమే కనిపిస్తోందని… నిర్ధారణ పూర్తికాకముందే అరగంటలో లోకేష్ ట్వీట్‌ వస్తుందని మండిపడ్డారు. పావుగంటకు చంద్రబాబు ట్వీట్‌… ఆ తర్వాత వర్ల రామయ్య ప్రెస్‌మీట్స్‌.. అంతకుముందే టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడులో దుష్ప్రచారం మొదలవుతుందని చురకలు అంటించారు సజ్జల.

కానీ చివరికి టీడీపీ వాళ్లే దొరుకుతున్నారు. ఇవన్నీ రాజకీయ లబ్టికోసం చేస్తున్నారేమో అనే అనుమానం వస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా ఈ శక్తులన్నీ (టీడీపీ నేతలు టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడు) సమన్వయంతో దుష్ప్రచారం చేస్తున్నాయని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. అమరావతి రాజధానిలో ఇన్నర్‌ రింగురోడ్డుకు సంబంధించి లింగమనేని, హెరిటేజ్‌ సంస్థల భూముల పక్కనుంచే అలైన్‌మెంటు ఎలా వెళ్తుంది? ఈ అంశంపై ప్రాధమిక సాక్ష్యాలున్న తర్వాత, ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేసు ముగియలేదు.. కేవలం విచారణను ఆపారు అంతేనని వివర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news