లోకేష్ కి సెటైర్ పడిందిగా: ప్రభుత్వ హత్యలు – ప్రకృతి మరణాల తేడా ఇదే!!

-

గతకొన్ని రోజులుగా ఏదొకటి మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు నారా లోకేష్! అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన సమయంలో.. ఆయన ఇంటికి వెళ్లిన లోకేష్.. ఏపీ ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతిలో తనకు ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు… అసలు ఎవరు అడిగారని? గుమ్మడి కాయ దొంగలా…! ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే! ఈ ఫ్లోని కంటిన్యూ చేస్తూ… మరికొన్ని పప్పుటడుగులు వేశారు!!

ఇదే క్రమంలో… కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం విషయంలో పెద్ద మనుషులుగా కావలి వైకాపా ఎమ్మెల్యే – బాలయ్య బాబుల మధ్య ఫోన్ సంభాషణలు జరిగి.. స్థానికంగా మరోచోట ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి సానుకూల సంధి జరిగిన సంగతీ తెలిసిందే. సరే వ్యవహారం ప్రశాంతంగా ముగిసిపోతుందని అంతా అనుకుంటున్న దశలో… ఇప్పుడు ఎక్కడ నుంచి ఆ విగ్రహాన్ని తొలగించారో, తిరిగీ అదేచోట పెట్టాలి.. పెట్టిస్తా.. అన్నగారి మనవడి మాట ఇది! అని తన మామ బాలయ్య సినిమాలో డైలాగులెక్క మాట్లాడేశారు లోకేష్! నిజంగా స్థానిక వైకాపా నేతలు బాలయ్యకు ఇచ్చిన మాట మేరకు.. మరోచోట విగ్రహం పెడితే లోకేష్ బాబు తల ఎక్కడ పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఫీలవుతున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… ఇదే ఫ్లోలో తాజాగా కరోనా పై స్పందించారు చినబాబు లోకేష్! కరోనా వల్ల ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కరోనా వల్ల మరణిస్తున్న వారి మరణాలను ప్రభుత్వ హత్యలుగా.. జగన్ ఖాతాలో వేస్తామని చెబుతున్నారు! కరోనా అనేది ఏపీకో, ఇండియాకు పరిమితమైన సమస్య కాదు. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న సమస్య! ఈ క్రమంలో… ఏపీలో మరణాలు జగన్ సర్కార్ హత్యలుగా పరిగణిస్తే… ఇండియా మొత్తం జరిగే మరణాలను మోడీ హత్యలుగా పరిగణించాలి! ఆ మాటనే ధైర్యం చినాబుకి గాని.. ఆయన బాబు చంద్రబాబుకి గానీ ఉన్నాయా? అభిమానుల అనుమానం!

దీంతో… అసలు ప్రకృతి వైపరిత్యాల వల్ల జరిగిన మరణాలకు, ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల, ప్రభుత్వ అలసత్వం వల్ల జరిగిన మరణాలకు తేడాలు చెబుతూ.. ఉదాహరణలు ఇస్తున్నారు విశ్లేషకులు! ఇందులో భాగంగా కరోనా వల్ల సంభవిస్తోన్న మరణాలను… ప్రకృతి మరణాలుగా చెబుతూ… గత ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ కోసం పుష్కరాలలో జరిగిన మరణాలను మాత్రం “ప్రభుత్వ హత్యలుగా” అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు!! లేపి తన్నించుకోవడం అనకూడదు కానీ.. అన్నంత పనిచేస్తున్నారు చినబాబు అభిమానులు! అసలే పరిస్థితులు బాగాలేదు.. గతాన్ని అస్తమానం గుర్తు చేయించుకోవడం అవసరమా అని!!

Read more RELATED
Recommended to you

Latest news