షర్మిల పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్.సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన కుమారుడు జగన్ వైసీపీ పార్టీ స్థాపించి ఏపీకి సీఎంగా కొనసాగుతున్నారు. అలాగే కూతురు షర్మిల కొద్ది రోజులు వైసీపీలో కొనసాగినప్పటికీ.. ఆ తరువాత తెలంగాణలోకి వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ప్రస్తుతం షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతుంది.

ఈ తరుణంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితమే షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని  పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పే పనుల్లో భాగంగా రాజమహేంద్రవరంలో విగ్రహాన్ని తయారు చేస్తున్న వడయార్ ని కలిసి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు వెళ్లి తన అన్న జగన్తో తేల్చుకోవాలని గతంలోనే తాను షర్మిలకు సూచించానని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news