షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం – గిడుగు రుద్రరాజు

-

నేడు చిత్తూరులో జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి మయ్యప్పన్, ఏపీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. అమర్నాథ్ అనే బాలుడిని సజీవ దహనం చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు..? అని ప్రశ్నించారు.

బాలుడి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు గిడుగు రుద్రరాజు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమె పట్ల మాకు గౌరవం ఉందన్నారు. చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఫలితమే ఏపీలోనూ రిపీట్ అవుతుందని.. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news