ఏపీ టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అధికారులు కీలక ప్రకటన విడుదల చేసారు..గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ఏపీ టెట్ కు మొత్తం 5.50లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే..ఈ పరీక్షల కోసం పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకొనెందుకు అవకాశం కల్పించారు.పరీక్ష కేంద్రాల ఆప్షన్ లింక్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. దాని కోసం ఈ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ అండ్ క్యాప్షా కోడ్ తో లాగిన్ అయితే.. అందులో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఈ ఏడాది దరఖాస్తులు ఎక్కువ రావడం తో ఆన్లైన్ ఎగ్జామ్ కు కంప్యూటర్ కొరత రావడంతో వేరే రాష్ట్రాలను పరీక్షా కేంద్రాలుగా చేసారు.మొదటగా ఆప్షన్స్ ఇచ్చిన వారికి సొంత జిల్లాలో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా ఇచ్చిన వారికి వేరే జిల్లాలో పరీక్షకేంద్రాలు కేటాయించే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నట్లు ప్రకటించారు. అందుకే చివరి సమయం వరకు ఎదురుచూడకుండా పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు.
మన దేశంలో ఏ ఉపాధ్యాయ కొలువులు సాధించాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఇప్పటికే తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్ కు జూన్ 15 నుంచి జూలై 15వరకు దరఖాస్తు ఫీజుకు అవకాశం కల్పించగా.. జూన్ 16 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించారు..పేపర్ 1ఏ, పేపర్ 1బీ, పేపర్ 2ఏ, 2బీల కింద ఈ పరీక్షలు ఉంటాయి. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 21 వరకు సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
అర్హత సాధించాలంటే.. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. వీటిలో అర్హత పొందిన వారికి డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈ టెట్ అర్హత ఒక్కసారి సాధిస్తే దాని వ్యాలిడిటీ అనేది గతంతో ఏడేళ్లు ఉండేది..ఈ నెల 25 న హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు..కీని ఆగస్టు 31, ఫైనల్ కీని సెప్టెంబర్ 12న విడుదల చేస్తామని తెలిపారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 14న విడుదల చేసేందుకు సిద్ధంగా వున్నట్లు అధికారులు వెల్లడించారు.