నేడు రష్యాకు ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత తొలి పర్యటన

-

ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 10వ తేది v రకు రష్యా, ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని జులై 8,9వ తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ (జులై 8వ తేదీ)న ఆయన రష్యాకు బయల్దేరనున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. 22వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, ఇరు దేశాల మధ్యనున్న సంబంధాలను సమీక్షించుకోవడం, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై నేతలిద్దరూ చర్చలు జరపనున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాకు పయనమవుతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనున్నారని పేర్కొంది. రష్యాలోని మాస్కో, ఆస్ట్రియాలోని వియన్నాలో ప్రవాస భారతీయులతో ప్రధాని సంభాషించనున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. భారత, ఆస్ట్రియా వ్యాపారవేత్తలను ఉద్దేశించి మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్‌ ప్రసంగించనున్నారని తెలిపింది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎంతో ముఖ్యమైందని రష్యా పేర్కొంది. ఈ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version