ఉచితాలను నమ్ముకోవద్దు అని నెత్తీనోరూ కొట్టుకుంటున్నా నమ్మడం లేదు బీజేపీ మాటలను వైసీపీ. కేంద్రం చెప్పే లెక్కలు రెబల్ ఎంపీ రఘురామ చెప్పే లెక్కలు ఒకే విధంగా ఉన్నాయి.కానీ వీటిని కూడా పట్టించుకోవడం వైసీపీ.అందుకనో ఎందుకనో వైసీపీ పై ప్రజలకు నమ్మకం తగ్గుతోంది అప్పుల భారం మోసేది తామే అన్న దిగులు వారిలో పెరిగిపోతోంది.
తల ఒక్కటింకి ఎలా లేదన్న లక్షకు పైగా అప్పు ఉంది. అయినా కూడా జగన్ తగ్గరు. అప్పులు చేయడమే మానుకోరు.ఆర్థిక విధానాలపై ఆయనకు అస్సలు పట్టులేదు. సంపద సృష్టి పై ఆయనకు దృష్టి లేదు అని యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన చెందుతున్నారు.
ఏటా అప్పులు పెరిగిపోతున్నాయని మనమంతా బాధపడిపోతున్నాం.కానీ ఏపీ సర్కారుకు అవేవీ పట్టవు. ఏటా రుణ భారం పెరిగితే ఏమౌతుంది..ఇవన్నీ పథకాల కోసం సంక్షేమం కోసం చేస్తున్నవే కదా! ఎందుకని మీరు అర్థం చేసుకోరు అని తిరుగు ప్రశ్న ఒకటి వేస్తారు జగన్.ప్రశ్నించిన వారిపై తిరుగుబాటు చేస్తారు వైసీపీ నాయకులు.ఇదే పంథాలో రాజకీయ కక్షలూ,కార్పణ్యాలూ ఉండనే ఉంటాయి.కానీ ఒక్కటంటే ఒక్కటి నోటిఫికేషన్ ను పూర్తి స్థాయిలో ఇవ్వలేని అసమర్థతలో జగన్ ఉన్నారన్నది ఓ వాస్తవం.
ఆ రోజు అధికారంలోకి రాగానే ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు తప్ప ఐదు వేల రూపాయలకు వలంటీర్ ఉద్యోగం తప్ప జగన్ చేసిందేం లేదనే తేలిపోయింది.ఏడు వేల కోట్ల రూపాయల అప్పు, లక్ష కోట్లకు పైగా పథకాల కోసం వెచ్చింపు.. ఏంటో ఈ లెక్కలు ఏంటో ఈ అప్పులు..తెలుగు దేశం అప్పు మూడున్నర లక్షల కోట్లు.. వైసీపీ అప్పు ఇప్పటిదాకా మరో మూడు న్నర కావొచ్చు. కాకపోనూవచ్చు. వీళ్లు చేస్తున్న అప్పులు అన్నీ ప్రజల కోసం..అనగా మన కోసం అనగా మన సంక్షేమం కోసం.