ఏపీలో ఫ్యామిలీ పార్టీలతో సంబంధం లేకుండా అధికారంలోకి వస్తాం – సోమువీర్రాజు

ఏపీలో ఫ్యామిలీ పార్టీలతో సంబంధం లేకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు సోమువీర్రాజు. బీజేపీ ఆందోళనలతో ఆలయాలపై దాడులు తగ్గాయని… చెన్నై లో ఆలయం వేలం వేయాలని చూసారు…బీజేపీ అడ్డుకుందని పేర్కొన్నారు. ఫామిలీ పార్టీలకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని.. మోడీ , యోగి లాంటి ప్రభుత్వాలు రావాలని వెల్లడించారు.

టీడీపీ , వైసీపీ హయాంలో హోమ్ మంత్రులకు డిఎస్పీ ని బదిలీ చేసే అధికారం ఉండదని.. ఏపీలో అభివృద్ధి మోడీ ద్వారానే సాధ్యమని వెల్లడించారు. కార్పొరేటర్ కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది…ఏపీలోను బీజేపీ అధికారం లోకి వస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ దగ్గర నవరత్నాల కంటే ఎక్కువ రత్నాలు ఉన్నాయని.. బీజేపీ పొత్తు జనసేనతోనే ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. ఒకాయన త్యాగం చేస్తామంటారు…ఏమి త్యాగం చేస్తారని చంద్రబాబు పై ఫైర్‌ అయ్యారు. ఏపీ లో విద్య, వైద్యం అధ్వాన్నంగా ఉన్నాయన్నారు సోము వీర్రాజు.