ఏపీ బీజేపీలో కొత్త ముసలం.. సోము వీర్రాజు వర్సెస్ సుజనా.. కారణం ఇదే!!

-

చాలా పార్టీలో రికమండేషన్ తో పదవులు పొందే బ్యాచ్ కొందరుంటే.. కష్టంతో కార్యకర్త స్థాయినుంచి ఎదిగి పదవులు పొందే వ్యక్తులు కొందరుంటారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు రెండో వర్గానికి చెందిన నాయకుడు! ఈయన ఎంట్రీ రికమండేషన్ తోనో, కుల బలంతోనో, ఆర్ధిక బలంతోనో వచ్చింది కాదనేది బీజేపీ నేతలు చెప్పే మాట! ఈ క్రమంలో పూర్తిస్థాయి ఆరెస్సెస్ భావాలతో నడిచి ఈ రోజు అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మొదటి ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలతో.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి పూర్తిగా విభేదిస్తున్నారు.. తన రేంజ్, సోము కంటే ఎక్కువని పరోక్షంగా చెబుతున్నారు!!

దేశ రాజ‌ధానిలో బీజేపీ జాతీయ నేత‌లు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు, సునీల్ దేవరా స‌మ‌క్షంలో సోము వీర్రాజు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని తేల్చి చెప్పేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు.. వాటి విషయంలో కూడా కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని మరింత క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో బాబు గతవైభవాన్ని కూడా గుర్తు చేసిన సోము… రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినా, తిరిగినా కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. అదే విధంగా నేడు కూడా మూడు రాజధాని విషయంలో కూడా అదే వైఖరితో ఉన్నామని.. కాకపోతే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని పూర్తి క్లారిటీ ఇచ్చారు.

రాజధాని విషయంలో బీజేపీ నుంచి ఇంత స్పష్టమైన క్లారిటీ వచ్చినా… ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి హోదాలో సోము తన మొట్ట మొదటి ప్రెస్ మీట్ లో చెప్పినా కూడా… సుజనా తనదైన శైలిలో స్పందించారు!

తాజాగా అమరావతి విషయంలో స్పందించిన సుజనా చౌదరి… రాజ్యసభ్య ఎంపీగా చెబుతున్నా అంటూ తన స్థాయిని గుర్తుచేస్తూ.. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని చెబుతున్నారు. అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్‌ ఇండియా కూడా గుర్తించిందని.. రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదని తెలిపారు. కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని.. రాజ‌ధానిపై కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌ని స్పష్టం చేశారు!

దీంతో… ఒక‌వైపు ఢిల్లీలో బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు మొట్ట మొద‌టి ప్రెస్ మీట్ లో రాష్ట్ర పార్టీగా మాత్ర‌మే రాజ‌ధాని అంశంపై పోరాడుతామ‌ని.. కేంద్రం జోక్యం ఉండదని చెప్పిన తర్వాత కూడా సుజనా ఇలా మాట్లాడటం పై బీజేపీ పెద్దలు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇదే విషయంలో రాజ‌ధాని విష‌యంలో పార్టీ విధానాల‌కు విరుద్ధంగా సుజ‌నా చౌద‌రి మాట్లాడటంపై సోము వీర్రాజు స్పందించి.. తాను అసలు సిసలు బీజేపీ మనిషినని, పార్టీ క్రమశిక్షణలో తాను ఫుల్ మార్కులు పొందగలనని నిరూపిస్తూ.. సుజనాపై చర్యలకు ఉపక్రమిస్తారా.? లేక, కన్నాకు తనకూ పేరులో, మనిషి సైజుల్లో తేడాలే తప్ప ఆలోచనల్లో కాదని కాం అయిపోతారా.? అనేది వేచి చూడాలి!!
కాగా… పార్టీ విధానాల‌కు విరుద్ధంగా మాట్లాడుతున్నారని సుజ‌నా చౌద‌రి ప్రియ శిష్యుడు లంకా దిన‌క‌ర్ కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది!

Read more RELATED
Recommended to you

Latest news