కర్నుడి చావుకి ఎన్ని కారణాలో కాంగ్రెస్ పార్టీ పతనానికి కూడా అన్ని కారణాలు అని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ పతనం వైఎస్సార్ మరణానంతరం వారు తీసుకున్న నిర్ణయాలు, తెలుగు రాష్ట్రాల విషయంలో వారు చేసిన తప్పులు మొదలైన కారణాలు దాగున్నాయ్యని.. వాటిలో ప్రధానమైనది రాజశేఖర్ రెడ్డిన్ని సొంతం చేసుకోవడంలో విపరీతంగా ఫెయిల్ అయ్యారని అంటారు! అయితే… ఈ విషయం వారీకీ అర్ధమయ్యిందని కొందరు చెబుతున్నా… ఇంకా అర్ధం కాలేదన్న విషయం మరోసారి అర్ధమయ్యింది!
కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడే కానీ.. బానిస కాదు! విధేతకు – బానిసత్వానికి మధ్య ఉన్న చిన్న గీతను ఏనాడూ తాటకుండా చాలా జగ్రత్తగా.. ఇటు పార్టీని గౌరవిస్తూ, అటు తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోకుండా.. పోరాటమే తన ఊపిరిగా కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే కాకుండా… అధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించి ఢిల్లీ పెద్దలకు చేదోడు వాదోడుగా ఉండేవారు డా. వైఎస్సార్! ఈ విషయాలను సోనియా మరిచింది.. కాంగ్రెస్ అధిష్టాణం మరిచింది.. కానీ తెలంగాణ కాంగ్రెస్ గుర్తుంచుకుంది!
వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం.. అనంతరం ఆయనను కొనియాడడం చేసింది టి.పీసీసీ. ఇప్పటికే ఆలస్యం అయినా కూడా వైఎస్సార్ ను సొంతం చేసుకునే హక్కు అర్థత తమ పార్టీకే ఉన్నాయన్నది వారి ఫీలింగ్.. వాస్తవం కూడా! కానీ… సోనియా గాంధీ & కో మాత్రం ఇంకా కళ్లు తెరవలేదు. పీవీ విషయంలో చేసిన తప్పునే వైఎస్సార్ విషయంలో కూడా చేస్తుంది!!
ఇప్పటికే వైఎస్ ను పూర్తిగా వైకాపా సొంత చేసేసుకుని చాలా కాలమే అయ్యింది.. ఫలితంగా జగన్ రోజు రోజుకీ ఎదుగుతున్నారు. వైఎస్సార్ ను దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, సొంతం చేసుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకీ పతనమైపోతుంది! ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ఎలాగో ఏమిటో?
కాబోయే భారత ప్రధానిని అంటూ కలలు కనే రాహుల్ గాంధీకి కూడా వైఎస్సార్ గుర్తుకురాకపోవడం కొసమెరుపు. కాంగ్రెస్ గతం… “బిఫోర్ వైఎస్సార్ – ఆఫ్టర్ వైఎస్సార్” కదా కనీసం తెలుగువారి వరకూ అయినా!