వర్మ “పవర్ స్టార్” ఫస్ట్‌ లుక్ నేడే విడుదల..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా క్లైమాక్స్, నేకెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్జీవి రానున్న రోజుల్లో కరోనావైరస్, థ్రిల్లర్, మర్డర్ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా పవర్ స్టార్‌ మూవీని తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు.

అయితే ఇప్పుడు తాజాగా “పవర్ స్టార్” యొక్క ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ని “RGVWORLDTHEATRE లో ఉదయం 11.37 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇది పూర్తిగా కల్పిత చిత్రం మరియు ఏదైనా నిజమైన వ్యక్తులతో పోలి ఉన్నా అది యాదృచ్చికంగా జరిగిన అనుకోని సంఘటన మాత్రమే” అంటూ వర్మ ట్వీట్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news