తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఏకంగా 98 ప్రత్యేక రైళ్లు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త అందించింది. తిరుపతి వెళ్లాలని భావించే కృష్ణ, ప్రకాశం నెల్లూరు జిల్లా ప్రజలకు సమ్మర్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని మచిలీపట్నం నుంచి ఏకంగా 98 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది.

రైళ్లు మచిలీపట్నం నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి నుంచి మచిలీపట్నం మధ్య సేవలందిస్తా మని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టంచేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా ఈ రైళ్లలో టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

ఏప్రిల్ మాసం ఆరవ తేదీ నుంచి 29 తేదీ, అలాగే మీ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ, జూన్ 1వ తేదీ నుంచి 29వ తేదీ లో మచిలీపట్నం నుంచి ప్రత్యేక రైలు సాయంత్రం ఐదు గంటల సమయానికి తిరుపతి వెళ్లనుంది. అదే ట్రైన్ మరుసటి రోజు ఉదయం ఏడు గంటల సమయంలో తిరిగి మచిలీపట్నం రానుందని అధికారులు ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news