పేదింటి బిడ్డా ఉన్నత చదువులు చదివేలా సాయమందించాడు…ప్రాణాపాయంలో ఉంటే ఆరోగ్యశ్రీతో అండగా నిలిచాడు…పేదల కలల స్వప్నం ఇల్లును నెరవేర్చాడు…ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచారు. వడ్డీరుణాలు, రుణమాఫీ పథకంతో వ్యవసాయాన్ని పండుగ చేశారు. 108పథకంతో లక్షలాది మంది ప్రాణాలను నిలిపారు. మధ్యాహ్న భోజనం అమలు చేసి..పేద పిల్లల కడుపు నింపడమే కాకుండా బడిబాట పట్టేలా చూశారు. జీవిత చరమాంకంలో కనీస అవసరాలు లేని కోట్లాదిమంది పండు ముసలిజీవితాలను..పింఛన్ పథకంతో మురిపించాడు.. మొత్తంగా వైఎస్ రాజశేఖరుడు..రామరాజ్యాన్ని మరిపించాడు…జయహో వైఎస్సార్ అనిపించుకున్నాడు.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోడానికి పాదయాత్ర చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,467 కిలోమీటర్లు నడిచారు. ఆ సమయంలో రైతులు, చదువుకోడానికి పేద విద్యార్థులు పడుతోన్న కష్టాలను చూసి చలించిపోయారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పరిపాలన సంస్కర్తగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కింది. తొలిసారిగా 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇదే నియోజకవర్గం నుంచి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా, కడప లోక్‌సభ నుంచి నాలుగు సార్లు గెలుపొందారు. పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలినా మంత్రి పదవి దక్కించుకున్నారు. సాటిలేని పాలన అందించి పేదల పాలిట దేవుడయ్యారు. పాలన అంటే ఇది కదా అనే రీతిలో ఆయన పరిపాలన సాగింది. పేదోడి అభివృద్ధియే లక్ష్యంగా..ప్రజా సంక్షేమమే పరమావదిగా వైఎస్సార్ పాలన సాగించారు. తెలుగు జాతి, ఖ్యాతిని దేశం నలుమూలల విస్తరింపజేశారు. ఇది కదా పాలన అంటే..ఇది కదా పేదోడు కోరుకునేది..బడుగు,బలహీన వర్గాలు ప్రభుత్వం నుంచి ఆశించేది అంటూ చాటి చెప్పారు.
పార్టీతో సంబంధం లేకుండా..పొత్తులు..ఎత్తులు లేకుండా దేశమంతా ఇప్పుడు వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మార్చి…మార్పులు..చేర్పులతో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విమర్శకులతో కూడా ప్రశంసలు అందుతున్న నేత వైఎస్సార్. నేడు ఆయన జయంతి. తెలుగు జాతి ప్రజలు ఆ దేవుడిని ఒక్కటే కోరుతున్నారు..రాజన్నను మళ్లీ తెలుగు నేలపై పుట్టించి..రాజశేఖరుడి పాలన అందించాలని. జోహార్ వైఎస్సార్..జోహార్..జోహార్..