కేసీఆర్ లేఖ గురించి జస్టిస్ నరసింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పంపించిన లేఖ కమిషన్ కి అందిందని..  పవర్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కేసీఆర్  లెటర్ లో పలు అంశాలను ప్రస్తావించారు. చత్తీస్ గడ్ పవర్ పర్చేస్, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉంది. లెటర్లో కేసీఆర్ చెప్పిన అంశాలను పరిశీలన చేస్తున్నాము. ఎవరికైనా తమ అభిప్రాయాలను నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. కేసీఆర్ తెలిపిన అభ్యంతరాలపై పున పరిశీలన జరుపుతాము. జరిగిన పరిణామాలను మాత్రమే మీడియా ముఖంగా నేను వివరించడం జరిగింది. ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజం. ఇటు కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉంది. వాస్తవాలపై BHEL ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతాం. మంగళవారం కేసీఆర్ పంపిన లెటర్ పై సమీక్ష,విశ్లేషణ జరుపుతామని వెల్లడించారు.  అందుకు అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు జస్టీస్ ఎల్ నరసింహారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news