విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఇవాళ పవన్ కళ్యాణ్ చర్చలు రెడీ అయ్యారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తో ఇవాళ మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా ప్రయివేటీకరణ వ్యతిరేకించడం సహా ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకునేందుకు కేంద్రంపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవాలని కోరనున్నాయి కార్మిక సంఘాలు.
దీంతో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంటు పరీరక్షణ పోరాట కమిటీ సమావేశంపై ఆసక్తి నెలకొంది. అటు రేపు ఢిల్లీలో స్టీల్ , ఆర్థిక మంత్రిత్వశాఖ లతో కీలక సమావేశం ఉండనుంది. ఇందులో కేంద్ర మంత్రులు, RINL ఇన్చార్జి CMD పాల్గొనున్నారు. ఢిల్లీ సమావేశం కంటే ముందు కార్మిక సంఘాలతో పవన్ భేటీపై ఆసక్తి నెలకొంది. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఇవాళ పవన్ కళ్యాణ్ జరిపే చర్చలు సఫలం అవుతాయో లేదో చూడాలి.