అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. న్యాయం కోసం 1000 రోజులుగా చేస్తున్న పోరాటం వారి సంకల్పానికి నిదర్శనం అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ” అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతోంది. న్యాయం కోసం 1000 రోజులుగా చేస్తున్న పోరాటం వారి సంకల్పానికి నిదర్శనం. లాటీలు ఝులిపించినా.. దాడులు చేసిన బరిస్తూ రైతులు ముందుకు సాగుతున్నారు.
వెయ్యి కిలోమీటర్ల రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి. మూర్ఖపు ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి”. అని ట్విట్ చేశారు. కాగా ఈనెల 12వ తేదీ నుండి అమరావతి నుండి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన రైతులు ఎట్టకేలకు హైకోర్టు అనుమతితో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలుు నిర్వహించి, ఆపై ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రధాన్ని వెంకటపాలెం గ్రామానికి తీసుకువస్తారు. 9 గంటలకు ప్రధానికి జెండా ఊపి లాంఛనంగా అమరావతి పాదయాత్రను ప్రారంభిస్తారు.
అమరావతి రైతులఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది.న్యాయంకోసం 1000రోజులుగా చేస్తున్నపోరాటం వారి సంకల్పానికి నిదర్శనం. లారీలు ఝులిపించినా.. దాడులు చేసినా భరిస్తూ రైతులు ముందుకు సాగుతున్నారు. వెయ్యి కిలోమీటర్ల రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి. మూర్ఖపు ప్రభుత్వం ఇకనైనా కళ్ళుతెరవాలి @ysjagan pic.twitter.com/iovsGLfVej
— Devineni Uma (@DevineniUma) September 12, 2022