ఏపీ విద్యార్థులకు శుభవార్త..రేపటి నుంచి సెలవులు

-

ఏపీ విద్యార్థులకు శుభవార్త. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి నుంచి వేసే సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి నేడు చివరి వర్కింగ్ డేగా విద్యాశాఖ పేర్కొంది. ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి రిపోర్ట్ కార్డులను అందించాలని ఆదేశించింది.

రేపటి నుంచి జూన్ 11 వరకు బడులు మూతపడనున్నాయి. తిరిగి జూన్ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వీటికి ప్రాధాన్యమిచ్చి భర్తీ చేయాలని కేంద్ర ప్రాజెక్టు ఆమోదిత మండలి వెల్లరించింది. కేంద్ర విద్యా శాఖకు రాష్ట్రం నుంచి అందిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం 45,355 ఖాళీలు ఉన్నట్లు బహిర్గతం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news