రేపటినుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. ఏటీఎం చార్జీలలో కీలక మార్పులు..

-

ఏప్రిల్ నెల నేటితో ముగిసిపోయింది.. రేపటి తో మే నెల మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.. జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్ మొదలగు వాటిలో మార్పులు వచ్చాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

*. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లను సవరిస్తుంది. గత నెల లో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028 ఉంది. ప్రభుత్వం మే 1న ధరలను మార్చవచ్చు..

*. కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే మీ ఈ-వాలెట్ కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌ లో పెట్టుబడి పెట్టలేరు. ఈ నిబంధన కూడా మే 1 నుంచి అమల్లోకి రానుంది…

*. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జీలు కూడా మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాల్లో బ్యాలెన్స్‌ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10 తో పాటు అదనపు చార్జీలను భరించాలి..

*. ఇకపోతే జీఎస్టీ ఇన్‌వాయిస్‌ ల అప్‌లోడ్‌కు సంబంధించి మే 1 నుంచి కొత్త రూల్ అమలవుతుంది. ఈ రూల్ ప్రకారం.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రసీదులను ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో ఏడు రోజుల వ్యవధిలో అప్‌లోడ్ చేయాలి.. ఇప్పటివరకు అయితే ఎటువంటి అదనపు చార్జీలు అయితే లేవు..

 

Read more RELATED
Recommended to you

Latest news