ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. పాఠశాలలను ఏప్రిల్ మాసం చివరి వరకు నడిపి మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని ఏపీ విద్యాశాఖ అధికారులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. పదోతరగతి పరీక్షలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జూన్ చివరి వరకు వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు.
సాధారణంగా జూన్ 12వ తేదీ నుంచి నూతన సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ పదో తరగతి పరీక్షలు ఆలస్యం కానున్న నేపథ్యంలో… జూలై మొదటి వారం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది సర్కార్. ఏప్రిల్ మాసం మొదటి వారం నుంచి ఒక పూట తరగతులు నిర్వహించ నున్నారు. అయితే ప్రతి ఏడాది మార్చిలోనే ఒంటిపూట బడులు నిర్వహించేవారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పనిదినాలు తక్కువగా ఉండటంతో ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.