కృష్ణాజిల్లా మచిలీపట్నం: అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా టిడిపి నాయకులు. రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు నేతృత్వంలో టీడీపీ జిల్లా నేతలు కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలను వివరించారు.
కలెక్టర్ ని కలిసిన వారిలో పామర్రు, పెడన నియోజకవర్గ ఇంచార్జ్ లు వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా కొనకల్ల నారాయణరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన టీడీపీ పోరాడుతుందని హెచ్చరించారు.