బీర్‌ తాగితే నిజంగా కిడ్నీలో రాళ్లు కరుగుతాయా..?

-

బీర్‌: కిడ్నీలో రాళ్లు అనేది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంటాయి.. నిజానికి ఇది చాలా సాధారణమైన విషయం అయిపోయింది. అలా అని అశ్రద్ధ చేసేంత చిన్నది కాదు. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకునేందుకు ఒక్కక్కరు ఒక్కో రకమైన పద్ధతులు పాటిస్తారు.. కొందరు వైద్యులను సంప్రదిస్తారు. ఇంకొందరు ఇంటి చిట్కాలు పాటిస్తారు. ఇక మందు బాబులైతే.. బీర్‌ తాగితే రాళ్లు కరిగిపోతాయి అని ఇంకా ఎక్కువ తాగేస్తుంటారు. అసలు బీర్‌ తాగితే నిజంగా కిడ్నీలో రాళ్లు కరుగుతాయా..? వైద్య నిపుణులు ఏం అంటున్నారు..?

 

మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. నిజానికి ఆరోగ్యం అంతా కిడ్నీలపైనే ఆధారపడి ఉంటుంది. శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి. పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో దుర్వాసనతో కూడిన మూత్రం రావడం కిడ్నీ స్టోన్‌కు ప్రధాన లక్షణం. ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే జ్వరం, చలి, సాధారణం కంటే తరచుగా మూత్రవిసర్జన వస్తుంటుంది.

ఆ అపోహలు మీకు ఉన్నాయా..?

కిడ్నీ స్టోన్ విషయాలపై అనేక అపోహలు ఉంటాయి. టమోట, పాలకూర వంటివి తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. వీటిని తగిన మోతాదులో తింటే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు, కొన్ని రకాల వ్యాధులు కూడా రాకుండా ఇవి నివారించగలుగుతాయి. బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ కరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది..

బీర్ తాగడం వల్ల రాయి త్వరగా తొలగిపోతుందనే అపోహను చాలా మంది ప్రచారం చేస్తున్నారని వైద్యులు అంటున్నారు..కానీ, ఇది నిజం కాదట.. అలాంటి అపోహలను నమ్మవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉంటే.. సొంత వైద్యాలు కాకండా.. ముందు వైద్యులను సంప్రదించి సమస్య ఎక్కడ వరకూ వచ్చిందో తెలుసుకోండి.! దాన్ని బట్టి.. ఇవి ఆహారం ద్వారా కరుగుతాయా లేక ఆపరేషన్‌ చేయాల్సి వస్తుందా అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news