నివేధిక వచ్చింది.. పరారీలో ఆ బాబులు.. మౌనదీక్షలో ఈ బాబులు!

-

కరోనా కష్టకాలంలో ప్రజలను ఎలా ఆదుకోవాలి.. ప్రజలకు ఎలా తోడుండాలి.. ఆర్ధిక ఇబ్బందులనుంచి ప్రజలను ఎలా రక్షించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే… ఈ కరోనా సమయం సువర్ణావకాశం అంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు.. ధనాపేక్షే పరమావధిగా ముందుకు సాగిపోతున్నాయి. ప్రజల భయాన్ని బలహీనతలను క్యాష్ చేసుకునే విషయంలో నిస్సిగ్గు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాధం జరిగిందనే సంకేతాలు బలపడుతున్నాయి.. ఇందులో భాగంగా తాజాగా జేసీ శివశంకర్ కమిటీ నివేదిక ఇచ్చింది!

అనుమతి తీసుకున్నదేమో కరోనా పాజిటివ్ పేషెంట్లకు అని.. కాని అక్కడ ఉన్నది కరోనా భయంతో ఆసుపత్రి వర్గాల మాటలతో, యాజమాన్యాల ధనాపేక్ష కారణంగా ఉన్నవారు. అన్యాయంగా బలైపోయారు!! ఇందులో భాగంగా హుటాహుటిన స్పందించిన ప్రభుత్వం.. ఆ ప్రమాధంపై కమిటీలు వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా జేసీ శివశంకర్ కమిటీ నివేదిక ఇచ్చింది! రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని.. కోవిడ్ పేషేంట్స్ నుంచి భారీగా డబ్బు వసూలు చేసిందని.. అనుమతికి మించి పేషేంట్లను చేర్చుకున్నారని నివేదికలో వెల్లడైంది!

ఆ సంగతులు అలా ఉంటే… ఈ ఘటనపై స్పందించడానికి, ప్రజల తరుపున మాట్లాడటానికి ప్రతిపక్షాలు ముఖం చాటేశాయి. పోయినవారెలాగూ తిరిగి రారు.. ఉన్న పెద్ద దిక్కులను దూరం చేసుకోవడం ఎందుకని భావించారో ఏమో కానీ… రమేష్ హాస్పటల్ యాజమాన్యమే ముద్దు.. ప్రజలు వద్దు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్‌ యజమాని శ్రీనివాస్‌ బాబులు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news