అసెంబ్లీ సమావేశాల్లో 15 అంశాలు లేవనెత్తాలని టిడిఎల్పీ నిర్ణయం

-

టీడీపీ కార్యాలయంలో టీడీఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో 15 అంశాలు లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ తాజా అరెస్టులు పైనా టీడీఎల్పీలో చర్చ జరిగింది. రైతుల పాదయాత్ర సమయంలో ఉద్దశ్య పూర్వకంగా కేసులు పెడుతున్నారని టీడీఎల్పీ పేర్కొంది. లావాదేవీలే జరగని అంశాల్లో అక్రమ కేసులేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు సెక్షన్లు పెట్టిన సీఐడీ అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టే అంశంపై టీడీపీ కసరత్తు చేసింది.

భారీ వర్షాలు-వరదలకు పంట నష్టం.. టిడ్కో ఇళ్ల పంపిణీ, గృహ నిర్మాణం అంశాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని టీడీఎల్పీ భావిస్తోంది. దళితులు, మైనార్టీలపై దాడులు, రాష్ట్రంలో క్షీణించిన శాంత్రి భద్రతలు తదితర అంశాలపై చర్చకు పట్టు పట్టాలని యోచిస్తోంది. బాక్సైట్ అక్రమ మైనింగ్, మద్యం కుంభకోణం, నిత్యావసర ధరల పెరుగుదల, పోలవరం, అమరావతి నిర్మాణాల్లో నిర్లక్ష్యం అంశాలపైనా ప్రస్తావన తీసుకురానుంది. అస్తవ్యస్తంగా రహాదారులు, లేపాక్షి భూములు, విభజన హామీల అమలు, పంచాయితీల నిధుల మళ్లింపు, శాండ్ మైనింగ్ వంటి అంశాలపై ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news