నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకొని బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి అంశం ఆధారంగా జరుగుతున్న రాజకీయం టిడిపికి నష్టాన్ని మిగుల్చుతుండగా.. వైసిపి మాత్రం లాభపడుతోందన్న దిశగా ఆయన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమరావతి భజనతో టిడిపి ఇతర ప్రాంతాల్లో దెబ్బతిన్నదని టిజి వెంకటేష్ పేర్కొన్నారు. అదే సమయంలో అమరావతి వ్యతిరేక నినాదంతో వైసిపి ముందుకు వెళుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వైసిపి నినాదం రాష్ట్రాభివృద్ధి కాదన్న టీజీ.. అమరావతి వ్యతిరేక వాదమే ఆ పార్టీ నినాదంగా మారిందన్నారు. కేంద్ర నిధులు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని టి.జి.వెంకటేష్ ఆరోపించారు.