రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానంటున్న టీడీపీ నేత… లోకేష్ కు కొత్త టెన్షన్?

లోకేష్ కు బ్యాడ్ టైం మామూలుగా నడుస్తున్నట్లు లేదు! “మందలగిరి”లో ఓడిపోయినప్పటినుంచి మొదలు ఏది ముట్టుకున్నా మట్టైపోతున్నట్లుగా మారిపోయింది పరిస్థితి! ఒకపక్క మాజీ మంత్రులు అరెస్టవ్వడాలు.. వాటిలో అవినీతికి సంబంధించిన కేసుల్లో చినబాబు ప్రమేయం ఉందన్నట్లుగా కథనాలు రావడాలు.. మరోవైపు కరోనా భయంతొ ఇల్లు కదిలి బయటకు రాలేని భయాలు… వీటన్నింటి మధ్య చంద్రబాబుదేమో కానీ… చినబాబు రాజకీయ భవిష్యత్తు మొదలవ్వకుండానే ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుందని అంటున్నారు విశ్లేషకులు! దానికి తగ్గట్లు టీడీపీ నేత, మాజీ మంత్రి ఒకరు… రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు!

police arrested ex minister kollu ravindra

అవును… ఇప్పటికే దూకుడు, మాస్ ఫాలోయింగ్ ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే… తన పరిస్థితి ఆటలో అరటిపండు అయిపోతుందని ఆందోళన చెందుతున్న లోకేష్ కు… మరో మాజీ మంత్రి ఝులక్ ఇచ్చినంతపనిచేశారు! చంద్రబాబు ఎలాగూ చల్లబడ్డారు.. ఈ సమయంలో కాస్త దూకుడు, ఫాలోయింగూ తెచ్చుకుంటే.. ఉన్నతమైన స్థానాలు పొందొచ్చని భావిస్తున్నారో లేక “అంతకుమించి”న ఆలోచనలు ఏమైనా ఉన్నాయో ఏమో కానీ… కొల్లు రవీంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని.. ఫలితంగా పార్టీని మరింత బలోపేతం చేస్తానని ప్రకటించారు!

అచ్చెన్న టెన్షనే ఒకెత్తు అయితే.. మళ్లీ కొల్లు రవీంద్ర టెన్షన్ ఏమిటిరా బాబు అంటూ… లోకేష్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. పార్టీలో చంద్రబాబు తర్వాత తానే అన్నీ కావాలని భావిస్తే… అచ్చెన్నా రూపంలో ఆటంకం వచ్చింది! నడిచంటే కష్టం కానీ.. కనీసం సైకిల్ వేసుకుని అయినా రాష్ట్రం మొత్తం తిరుగుతారని వార్తలు వచ్చిన తరుణంలో… ఇప్పుడు రవీంధ్ర రూపంలో మరో టెన్షన్ స్టార్ట్ అయ్యిందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు!

ఈ విషయంలో గుడ్డిలో మెల్ల ఏమిటంటే… అచ్చెన్న పదవి, కొల్లు రవీంధ్ర పర్యటనకు అనుమతి… ఇవి రెండూ ఇంకా చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి! మరి వాటిని చినబాబు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆపుతారా లేక… ఇలానే గడిపేద్దామని భావిస్తారా అనేది వేచి చూడాలి! ఆ సంగతులు అలా ఉంటే… ఇకనైనా చినబాబు భాగ్యనగరం వదిలి ప్రజల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు! అలాకానిపక్షంలో చినబాబు జీవితానికి సరిపడా చారిత్రక తప్పిదం చేసినట్లేననేది వారి ఆందోళన!!

-CH Raja