అయ్యన్న అరెస్టు.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

-

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటిని తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో చుట్టముట్టిన పోలీసులు.. ఆయణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

గోడలు దూకి, తలుపులు పగల గొట్టి దౌర్జన్యం చేయడమేంటని టీడీపీ నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని ఆరోపించారు. ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఇంటి నిర్మాణాలు కూల్చివేత నుంచి అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు.

అయ్యన్నపాత్రుడి అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. పార్టీ అన్ని విధాల అదుకుంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్టుకు సంబంధించి న్యాయపరంగా పోరాడుతామని హమీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news