బాబు మౌనంపై సీనియర్లు ఫైర్… కారణం ఇదే!

రూము జూము మినహా కొంతకాలంగా చంద్రబాబు వైఖరి చూస్తున్నవారు ఆయన పరిస్థితిని కొందరు అర్థం చేసుకుంటే… మరి కొందరు మాత్రం ఫైరవుతున్నారంట. అలా ఫైరవుతున్నవారు ప్రత్యర్ధి పార్టీ నేతలో లేక మరొకరో ఇంకొకరో కాదు సుమా… స్వయంగా ఆయన సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నేతలు!

Nara-Chandrababu-Naidu


అవును… చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కడపలో తనదైన చక్రం తిప్పాలని భావించినా.. అది సక్సెస్ కాలేదు! అయితే…ఈ విషయంలో చిత్తురులో, కుప్పంలో చక్రం తిప్పే విషయంలో వైకాపా సక్సెస్ అవుతుంది! ప్రస్తుతం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైకాపా చాపకిందనీరులా అల్లుకుపోతుంది!

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని పంతంమీదున్న అధికారపక్షం… బాబు నియోజకవర్గంలో ఇంతకాలం జరగని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుంది! టీడీపీ నేతలకు సైతం ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతో.. వారి మనసులు కూడా దోచుకుంటుంది! ఫలితంగా అటు సామాజికంగా ఇటు రాజకీయంగా కుప్పంలో ఫ్యాన్ తిప్పే పనిలో వైకాపా ముందుకు పోతుంది!

మరి ఈ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు మౌనాన్నే తన బాషగా ఎందుకు ఎంచుకున్నారనేది తమ్ముళ్లకు అర్ధం కావడం లేదంట! దీంతో కొందరు టీడీపీ సీనియర్ నేతలు కూడా మా నాయకుడు తన నియోజకవర్గాన్ని వదిలేసుకుంటున్నట్టారు అంటూ కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం బాబు వ్యవహారశైలిపై ఫైరవుతున్నారంట! మరి బాబు ఇకనైనా కుప్పం వైపు చూస్తారా లేక వదిలేసుకుంటారా అన్నది వేచి చూడాలి!!