వివాహేతర సంబంధం పెట్టుకున్న లాయర్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది ఓ భార్య. ఇంటిని అద్దెకు తీసుకుని ప్రియురాలితో కాపురం పెట్టిన భర్త చంద్రమౌళి.. భార్య రావడాన్ని గమనించి ఇంటి వెనుక నుంచి పరారయ్యాడు. చిత్తూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న చంద్రమౌళికి గతంలో డబ్బు ఆశ చూపి అనేక మంది మహిళలను లొంగదీసుకున్నాడనే ఆరోపణలున్నాయ్.
బంధువులతో కలసి వచ్చిన భార్య.. తనకు న్యాయం చేసేలా చూడాలని అద్దె ఇంటి ముందు బైఠాయించారు. చంద్రమౌళి గతంలో కాల్‌మని కేసులో ఓ సారి అరెస్టయ్యాడు. డబ్బు ఆశ చూపించి పలువురు మహిళలతో అక్రమ సంబంధం నడిపిన ఆరోపణలు చంద్రమౌళి పై ఉన్నాయి.