ఆ హనుమండిలా చంద్రబాబు ఆదేశాలు పాటిస్తా – కేశినేని నాని

-

ఆ హనుమండిలా చంద్రబాబు ఆదేశాలు పాటిస్తానన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మీడియాతో కేశినేని నాని చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఫేస్ బుక్ పోస్ట్ లో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని..అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు కేశినేని నాని. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తా అని స్పష్టం గా ఫేస్ బుక్ లో పెట్టానని..మీడియాకు కావాల్సింది మసాలెనేగా అని తెలిపారు. తినబోతూ రుచులెందుకు, అన్ని విషయాలు ఒకే రోజెందుకు? ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు, రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు? అని వివరించారు.

అది ఎవరికి ఎలా అర్ధమైతే అలా ఇచ్చుకోండి, మీడియాను పట్టించుకోవటం ఎప్పుడో మానేశానన్నారు కేశినేని నాని. రేవంత్ రెడ్డి దొంగా, అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది…ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు, మీడియా ఏం పీకగలిగిందని చురకలు అంటించారు. 2024 మే వరకూ నేనే విజయవాడ ఎంపీని…. నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారన్నారు కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Latest news