అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు కుర్రాడు..!

-

సాధారణంగా భూమి పై నుంచి అంతరిక్షంలోకి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఇక మన తెలుగు కుర్రాడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడంటే ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ తప్పకుండా చాలా సంతోష పడుతారు. ఆ తెలుగు వ్యక్తి ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంతరిక్షంలోకి తెలుగు కుర్రాడు వెళ్లునున్నారు. గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా 30 ఏళ్ల గోపీచంద్ ఏపీ లోని విజయవాడకు చెందిన కుర్రాడు. ఆయన ఒక పైలట్, ఏవియేటర్. ఆయన విద్యాభ్యాసం ఫ్లోరిడా, దుబాయ్ లో కొనసాగింది. ప్రస్తుతం గోపి అమెరికాలో నివసిస్తున్నారు. బ్లూ ఆరిజన్ న్యూ షెఫర్డ్-25 మిషన్ కోసం ఆయన ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో ఐదుగురు స్పేస్ లోకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మిషన్ ప్రయోగ తేదీ ఇంకా వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news