అపనమ్మక ఫలితం.. పవన్ కు బీజేపీ పెట్టే పరీక్ష ఇదేనా?

-

ప్రజారాజ్యం అంటూ చిరంజీవి స్థాపించిన పార్టీ.. అనతికాలంలోనే కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది! ఎవరూ ఊహించలేదు.. అనుకోనూ లేదు.. రెండు రోజుల ముందు గాసిప్స్ వచ్చాయి.. హస్తినలో చిరు వాటిని నిజం చేసేశారు! ఫలితం.. చిరు రాజకీయం ఆటలో అరటిపండు! అయితే ప్రస్తుతం పవన్ స్థాపించిన జనసేన కూడా బీజేపీలో కలపవలసిందే అని.. బీజేపీ స్కెచ్ అదేనని.. కానిపక్షంలో పవన్ కు ఇరకాటమే అని.. నమ్మకం అవసరమని కామెంట్లు వినిపిస్తున్నాయి.. అందుకు గల తాజా ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం!

చిన్న చితకా రీజనల్ పార్టీలను వీలైతే మిత్రత్వం కుదిరితే విలీనం దిశగా అడుగులు వేస్తుంటాయి జాతీయ పార్టీలు! అందులో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అలానే చేయగా.. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా రాజకీయాలు చేస్తుంది. అందులో భాగంగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో ఎల్‌జీపీని నితీష్‌కుమార్‌కు దూరం చేసింది బీజేపీ! ఇదే క్రమంలో.. నితీష్‌తో అంట‌కాగుతూనే.. రామ్‌విలాస్ పాశ్వాన్‌ కుమారుడిని రెచ్చగొట్టి.. నితీష్ బ‌లాన్ని త‌గ్గించేలా చేసింది! ఫలితం… తమకు అక్కడ అంత బలం లేకపోయినా… త‌న వ్యూహంతో ప్రాంతీయ పార్టీల మ‌ధ్య చిక్కులు పెట్టి పెద్దన్న కుర్చీ ఎక్కేస్తుంది!

సపోజ్ ఫర్ సపోజ్ ఇదే సూత్రం ఏపీలో కూడా అప్లై చేస్తే.. కచ్చితంగా పవన్ తన జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సిన పరిస్థితి వస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది! ఎందుకంటే… ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ప‌వ‌న్.. అనంతరం బీజేపీతోనే చేతులు కలిపారు! మరి అలాంటప్పుడు.. ఎన్నికల వరకూ తమతో అంటకాగి కాస్తో కూస్తో కేడర్ ని పెంచుకుని, బలపడి.. అనంతరం ఎన్నికల సమయానికి తన ప్రాణస్నేహితుడు చంద్రబాబు దగ్గరకు చేరరనే నమ్మకం ఏమిటి? అనేది బీజేపీ మాటగా ఉంది!!

సో.. ఈ నాలుగు రోజులూ ఎలా సాగినా, మరెలా గడిచినా, కమలం కింద కాలం గడిపేసినా… ఎన్నికలు సమీపించే సమయానికి మాత్రం కచ్చితంగా జనసేనను వీలినం చేసుకునే దిశగానే కమలనాథులు ఆలొచిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు! సపోజ్ ఫర్ సపోజ్ అదే నిజమైతే మాత్రం… మెగా ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయినట్లే!! ఆ పార్టీని నమ్ముకున్నవారు నట్టేట మునిగినట్టే!! మరి పవన్ నిలుస్తారా కలుస్తారా కలిసిపోతారా అన్నది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news