అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కమిషన్లు తీసుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ చేసిన ఆరోపడాలపై స్పందించారు రమేష్ బాబు. తాను కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంబటి బ్రాహ్మణయ్య సీటు వాళ్ళ కుటుంబానికి రాకుండా చేసిన బుద్ధప్రసాదుకు అంబటి కుటుంబం దూరం కావటంతోనే.. వారిపై కోపంతో వక్కపట్లవారిపాలెం లే-ఔట్ మెరక పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
నియోజకవర్గంలో ఎక్కడ మట్టి తవ్వినా తనకు, నరసింహారావుకు అంటగట్టి కోట్లు కొల్లగొట్టేస్తున్నట్లు దుష్ప్రచారం చేయటం, ఉద్యమాలంటూ ఒక పూట హడావుడి చేయటం తెల్లారితే మళ్ళీ ఏమీ లేకపోవడం బుద్ధప్రసాదుకు అలవాటేనని విమర్శించారు. టీడీపీ పాలనలో నీరు – చెట్టు, జన్మభూమి కమిటీల ద్వారా సాగిన దోపిడీనే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం అన్నారు రమేష్ బాబు. కోడూరు రోడ్డు, డెల్టా ఆధునీకరణ పనుల్లో బుద్ధప్రసాద్ కమీషన్లు పొందటంతోనే నిరుపయోగంగా మారాయన్నారు.