రాజారెడ్డి వల్లే జగన్ అలా తయారయ్యాడు: జేసీ!

-

జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేయడంలో జెసి బ్రదర్స్ తమదైన శైలి చూపిస్తారు.తాజాగా జగన్ ను ఆయన తల్లిదండ్రులు ఎలా పెంచారు అన్నదాని పై సెటైరికల్ కామెంట్లు వేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.అయితే ఈ విషయంలో ఆయన ఎక్కడా లైన్ క్లాస్ చేయలేదు.జగన్ క్యాబినెట్ లోని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ముడిపెట్టే ఇలా మాట్లాడారు.ఏపీలో నేరాలు పెరిగిపోతుండటం పై పిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచక పోవడం వల్లే, ఇలాంటివి జరుగుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను జగన్ కు అన్వయించి అర్థం చెప్పేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

మా రాజశేఖర్ రెడ్డి ని ఏమీ అనవద్దు అంటూ హోంమంత్రి వనితకు జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు.ఎందుకంటే కూడా కారణం చెప్పారు..” ఆయన్ను తల్లి సరిగా పెంచలేదని ఓ మహాతల్లి చెప్పింది.ఆమె చెప్పింది కరెక్టే..ఈయన్ని పెంచడం మా రాజశేఖర్ రెడ్డికి కష్టం అయింది.వాళ్ళ అమ్మ పెంపకం మంచిదే..కానీ అప్పటికే డైవర్ట్ అయి వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గరికి ఆయన వెళ్ళాడు.తాత రాజారెడ్డి పెంపకంతో సేమ్ టు సేమ్ రాజా రెడ్డి లాగే తయారయ్యాడు.మా రాజశేఖర్ రెడ్డి ని ఏమీ అనద్దు”.అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news