కోపంగా వస్తున్న రాజ‘శేఖర్’..ఈ సారి ఏం చేస్తాడో?

-

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్..సెకండ్ ఇన్నింగ్స్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ‘పీఎస్ వీ గరుడ వేగ’ పిక్చర్ తో సక్సెస్ అందుకున్న ఈ యాంగ్రీ హీరో.. ఆ తర్వాత నటించిన సినిమాలకు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు. ఈ క్రమంలోనే రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘శేఖర్’ సినిమా పై తాజా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ లుక్స్ అదిరిపోయాయి. రాజశేఖర్ కూతురు శివాత్మిక ఈ మూవీలో కీ రోల్ ప్లే చేసింది. మ్యాన్ విత్ ద స్కార్ అనే క్యాప్షన్ తో రూపొందుతున్న పిక్చర్ ‘శేఖర్’..రిలీజ్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.

‘శేఖర్’ చిత్ర టీజర్ ను ఈ నెల 5న విడుదల చేస్తు్న్నట్లు రాజశేఖర్ ట్వి్ట్టర్ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్ చూసి సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ ఈ మూవీతో తప్పక విజయం సాధిస్తారని నెటిజన్లు అంటున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్..ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news