28 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు – మంత్రి బొత్స

-

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన ఆంధ్రప్రదేశ్ వాసులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలోని కేజీహెచ్, అపోలో, సెవెన్ హిల్స్ ఆసుపత్రులలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రుల్లో ఐదుగురు చికిత్స పొందుతున్నారని.. మరో నలుగురిని ఒడిశా నుంచి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

11 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు మంత్రి బొత్స. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. లక్ష పరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ లలో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని తెలిపారు. వారిలో 553 మంది సురక్షితంగా ఉన్నారని.. 92 మంది తాము ట్రావెల్ చేయలేదని తెలిపినట్లు వివరించారు. మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్ కి అందుబాటులోకి రాలేదన్నారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news