తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు భధ్రతాధికారులు. తిరుమలలో టెర్రరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులుకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మాడవీధులతో సహ ముఖ్య ప్రాంతాలలో తనిఖిలు ప్రారంభించింది భధ్రతా సిబ్బంది.
అయితే… ఈ సంఘటనపై తిరుమల ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. తిరుమలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తిరుమల ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. టెర్రరిస్టులు ఉన్నట్లు పోలీసులకు అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో అప్రమత్తమయ్యారు. బందోబస్తు పెంచి తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ మెయిల్ ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, 24/7 భద్రత కట్టుదిట్టంగా ఉందని తెలిపారు.