యాత్రికులకు అలర్ట్.. కేదార్​నాథ్​లో మంచు వర్షం

-

కేదారీశ్వరుడి దర్శనం కోసం కేదార్​నాథ్ బయల్దేరిన యాత్రికులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం మంచు తుపానుతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మంచు వర్షం కురిసే అవకాశం ఉందని యాత్రికులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. హిమాల‌య రీజియ‌న్‌లో రాబోయే రెండు రోజుల్లో భారీ వ‌ర్షంతో పాటు మంచు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ జిల్లా మెజిస్ట్రేట్ మ‌యూర్ దీక్షిత్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

కేద‌ార్‌నాథ్ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు మెజిస్ట్రేట్ ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తులు ఒకే చోట ఉండాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం కేద‌ర్‌నాథ్ ధామ్‌లో మంచు కురుస్తుంద‌ని తెలిపారు. ఉద‌యం 10:30 గంట‌ల త‌ర్వాత సోన్‌ప్ర‌యాగ్ నుంచి కేద‌ార్‌నాథ్‌కు భ‌క్తుల రాక‌పోక‌ల‌ను నిలిపివేస్తామ‌ని ప్ర‌క‌టించారు. జిల్లా యంత్రాంగానికి భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని మెజిస్ట్రేట్ విజ్ఞ‌ప్తి చేశారు. వాతావ‌ర‌ణం పూర్తిగా చ‌క్క‌బ‌డిన త‌ర్వాత‌నే కేదార్‌నాథ్‌కు భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news