తిరుమల విషయంలో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల దేవస్థానానికి వెళ్లడానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఈ రెండు ఘాట్ రోడ్ల విషయం లో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఘాట్ రోడ్లను రాత్రి 8 గంటలకు మూసివేయనున్నారు. ఈ రెండు ఘాట్ రోడ్లను రేపు ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు.
అయితే మళ్లి ఈ రోడ్లను రేపు ఉదయం 6 గంటలకు తిరిగి వాహానాలను అనుమతి ఇస్తారు. ఘాట్ రోడ్డుల లో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఘాట్ రోడ్లను మూసి వేస్తున్నారు. అలాగే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు సాయంత్రం 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని టీటీడీ బోర్డు తెలిపింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళ నాడు రాష్ట్రాలలో వర్షాలు భారీగా పడుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి.