ఏపీలో ఈ ఏడాది కూడా ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి నో హాలిడే!

-

వచ్చే ఏడాదికి గాను ఏపీ ప్రభుత్వం సెలవుల క్యాలెండర్ ను నిన్న విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్చిక సెలవులు ఉన్నాయి. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలతో పాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని, వాటిని ముందుగానే పత్రిక ప్రకటన మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం తెలిపింది.

అలాగే, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి పండుగల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్చిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. ఇక వచ్చే ఏడాది మూడు సాధారణ సెలవులు సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారం వచ్చాయి. ఒకటి రెండో శనివారం వచ్చింది.ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి సెలవులు లేకపోవడంపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news