లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే పాలసీలులో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. దీనితో చక్కటి లాభాలని పొందొచ్చు.
అయితే LIC అందించే వాటిలో బీమా జ్యోతి కూడా ఒకటి. పాలసీతో సహజ మరణంతో పాటు ప్రమాదవశాత్తూ మరణించినా కూడా బీమా జ్యోతి ద్వారా బీమా ప్రయోజనాలు వస్తాయి. ప్రమాదకర వృత్తుల్లో పని చేసే వారికి ఇది మరెంత ఉపయోగం. ఈ పాలసీ లో సంవత్సరానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా ప్రీమియం చెల్లిస్తే మరణించాక కుటుంబానికి నెల నెలా నిర్ధిష్ట మొత్తంలో రూ.1,08,000 వరకూ కవరేజి వస్తుంది. అయితే ఎంత కవరేజి వస్తుందనేది కట్టే ప్రీమియం ని బట్టి ఉంటుంది.
పాలసీదారుడు ఎంత పెద్దవారైతే అంత తక్కువ ఆదాయం వస్తుంది. 30 ఏళ్ల వారికి రూ. 10 వేల ప్రీమియం చొప్పున 20 సంవత్సరాలు కడితే రూ. 5,000 వస్తాయి. 40 ఏళ్ల వాళ్లకి వారికి రూ. 10 వేల ప్రీమియం చొప్పున 20 సంవత్సరాలు కడితే రూ.4,500 వస్తాయి. దగ్గరలో ఉన్న ఎల్ ఐసీ బ్రాంచ్‌ల్లో సంప్రదించి ఈ బీమా జ్యోతి పాలసీ ని తీసుకో వచ్చు. LIC వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉంటుంది.