టీడీపీలోని “బూతు భాష ప్రావిణ్యుల” శాంపిల్ లిస్ట్ ఇది!

-

గురివిందగింజ బ్యాచ్ మొత్తం టీడీపీలోనే ఉన్నారని.. తమ కంట్లో దూళం పెట్టుకుని, ఎదుటివాడి కంటిలో నలుసు గురించి మాట్లాడతారని.. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన వీరికోసమే ఆ లైన్స్ రాశారాని చెబుతున్నారు వైకాపా నేతలు! ఇందుకు కారణమైంది.. ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడిన మాటలపై.. నీతులు మాట్లాడుతున్న టీడీపీ నేతల వ్యవహారం!

బూతు మాటలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు వంటి అంశాలపై ప్రస్తుతం అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. అసలు నాయకులు అనబడేవారు అలా మాట్లాడొచ్చా అంటూ ప్రవచనాలు చెబుతున్నారు! దీంతో… బూతు బాషపై టీడీపీ నేతలకున్న పట్టు విషయంలో పెద్ద లిస్టే బయటకు తీశారు వైకాపా నేతలు!

నర్శీపట్నం పోలీస్ స్టేషన్ లో జనం మరిచిపోలేని స్థాయిలో దౌర్జన్యాలు చేసి, తాజాగా మహిళా కమిషనర్ ని గుడ్డలూడదీస్తానని మొదలుపెట్టి బూతు పురాణం చెప్పిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. ఇప్పుడు సడన్ గా మైకందుకుని.. “అలాంటి మాటలు మాట్లాడకూడదు” అని చెప్పుకొస్తున్నారు!! వినేవాడు అంటే చెప్పేవాడికి అంత లోకువ మరి!

ఇక ఈ విషయంలో శ్రీకాకుళంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ లకు బూతు బాషపై ఉన్న గ్రిప్ మామూలుది కాదని.. అధికారుల మీద దుర్భాషలాడే విషయంలో వీరిద్దరూ పోటీ పడుతుంటారని.. వీరి ప్రవచనాల ఆడియోలు యూ ట్యూబ్ కి కూడా తెలుసని చెబుతున్నారు శ్రీకాకుళం ప్రజలు!

నిన్నకాకమొన్న… టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరి మునిసిపల్ అధికారుల మీద వాడిన తిట్ల పురాణాన్ని లోకమంతా చూసిన సంగతి తెలిసిందే. తర్వాత “నేనూ మనిషినే – నన్ను గుర్తించండి” అంటు క్షమాపణ చెప్పుకున్నా.. బూతులైతే రికార్డెడ్!

ఇక దెందుళూరు మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు అనుంగ శిష్యుడు అయిన చింతమనేని ప్రభాకర్ గురించి తెలియనివారుండరు. ఆయన దౌర్జ్యన్యాలు, దుర్మార్ఘాల గురించి పుస్తకాలు కూడా ప్రచురించొచ్చంటుంటారు వెస్ట్ గోడావరి జనాలు! ఇక ఆయన బూతు బాషలో కొత్త పద ప్రయోగాలు చేయగల భాషా ప్రావీణ్యుడు!

ఇవన్నీ మరిచిన టీడీపీ నేతల విష‌ ప్రచారానికి.. ఈ లిస్ట్ అంటా అడ్డుకట్ట వేయగలుగుతుందా లేక.. “మేము మాట్లాడొచ్చు, అది మా హక్కు, మాకు అవే వచ్చు.. కానీ మీరు మాట్లాడకూడదు” అని చెప్పేలా ఉంటుందా అన్నది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news