ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి నారాయణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ లకు కొత్తగా నియమించబడిన కమిషనర్ల తో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ…టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే అందరికీ పంపిణీ చేస్తామని కూడా తెలిపారు.
నగరాల్లో పార్కులు,సెంట్రల్ డివైడర్లు,రోడ్ల గుంతలు పూడ్చడం,డ్రెయిన్లు లో పూడిక తొలగింపుపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. రోడ్ల పై సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి ఫ్లెక్సీలు ఉన్నా వెంటనే తొలగించాలని… సెంట్రల్ డివైడర్ లలో ఫ్లెక్సీలు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తాగునీటి పరీక్షలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అన్న క్యాంటీన్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని… వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు(స్టేరిలైజేషన్) చేయించాలని వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ పై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని తెలిపారు.