Tirumala: ఏడాదిలో రూ.1,161 కోట్లు.. 1,031 కేజీల బంగారం

-

వడ్డీ కాసుల వాడి ఖజానా ఏటేటా పెరుగుతుంది. 2023-24లో భక్తులు సమర్పించుకున్న కోట్ల నగదు, 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. దీంతో శ్రీవారి నగదు డిపాజిట్లు రూ. 18వేల కోట్లకు చేరుకున్నాయి.

బంగారం నిల్వ 11,329 కేజీలకు చేరింది. ఈ మొత్తానికి ఏటా రూ. 1,200 కోట్ల వడ్డీ వస్తోంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కు నాలుగేళ్లలో రూ. 1,200 కోట్ల విరాళాలు వచ్చాయి. కాగా, తిరుమల వెళ్లే భక్తులకు షాక్‌..ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు. ఇక రేపు స్వర్ణరథం పై మాడవీధులలో ఉరేగనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామిగా దర్శనం ఇస్తారు.ఈ తరుణంలోనే… ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news