Tirumala: ఏప్రిల్ లోనూ రూ.100 కోట్లు దాటింది తిరుమల ఆదాయం. వరుసగా 24వ నెల 100 కోట్ల మార్క్ ని దాటింది తిరుమల శ్రీవారి హుండి ఆదాయం.ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారికి 101 కోట్లు కానుకగా సమర్పించారు భక్తులు. సిఫార్సు లేఖల పై జారి చేసే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చెయ్యడంతో …స్వల్పంగా తగ్గింది స్వామివారి హుండి ఆదాయం. లేకపోతే…. ఈ ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చేది.
కాగా, తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 05 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 06 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 72, 310 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 28, 731 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లుగా నమోదు అయింది.