ఈరోజు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే, విద్యార్థులు మార్కులు ఎలా చెక్ చేసుకోవాలో ఆ వివరాలు తెలుసుకుందాం. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం పాస్ చేయించింది. అయితే, విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయిస్తారన్నా దానిపై అనుమానాలు ఉన్నాయి. నేటితో దీనికి తెరపడనుంది. దీన్ని అధికారికంగా ప్రకటించారు ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి.
అయితే, మార్కుల కేటాయింపు 2020–21 సంబంధించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారం చేసుకుని గ్రేడ్స్ ప్రకటిస్తామని అన్నారు. విద్యార్థులు పది ఫలితాల కోసం
www.bse.ap.gov.in తో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
మెమొరాండమ్ ఆఫ్ సబ్జెక్టు వైజ్ పెర్ఫార్మెన్స్లను పాఠశాల హెడ్మాస్టర్స్ తమ పాఠశాల లాగిన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని డౌన్ లోడ్ చేసిన కాపీలను అటెస్టెడ్ సంతకాలు చేసి విద్యార్థులకు ఇవ్వాలని పేర్కొన్నారు.
గతేడాది విద్యార్థులకు కూడా.. 2021 విద్యార్థుల మాదిరిగానే అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడ్లు ప్రకటించాలని ప్రభుత్వం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు 2020, 2021కి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు గ్రేడ్లు విడుదల చేయనుంది.
ఫలితాలను ఇలా తెలుసుకోండి…
పదవ తరగతి ఏపీ ఫలితాల కోసం.. 2020 విద్యార్థులు ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఆల్‌పాస్‌గా ప్రకటించి గతంలో ధ్రువపత్రాలు ఇచ్చారు. వాటిలో వారి హాల్‌టికెట్ల నంబర్లు ఉన్నాయి. ఆ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా తమ గ్రేడ్లు తెలుసుకోవచ్చు. కేవలం సబ్జెక్టుల ప్రతిభ ఆధారంగానే ఫలితాలు వెల్లడించనున్నారు.