నేడు సీఎం వైయస్ జగన్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్. 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్న సీఎం జగన్.. 10.45 – 12.15 గంటల వరకు సీఎం బహిరంగ సభ ఉండనుంది.
అనంతరం వైఎస్సార్ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు సీఎం జగన్. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.నిరుపేదలుగా ఉన్న కాపు అక్క, చెల్లెమ్మలకు ఆర్థిక స్వాలంబన రావాలని ఈ మంచి పథకాన్ని తీసుకువచ్చారు సిఎం జగన్.
వైయస్సార్ చేయూత మాదిరిగానే వైయస్సార్ కాపునేస్తం తీసుకు వచ్చారు. ఈ పథకం ప్రకారం క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తూ పోతే ఐదేళ్లపాటు ఇలా 75 వేలు అక్క చెల్లెమ్మల చేతిలో ఉంటుందన్న మాట. తన కాళ్లమీద వాళ్లు నిబడగలుగుతారనే గొప్ప ఆలోచన నుంచి ఈ పథకం పుట్టింది.